బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్‌రావు భేటీ.. రైతు సభపై కీలక చర్చలు

కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్‌రావు భేటీ.. రైతు సభపై కీలక చర్చలు

మే 03, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావుతో పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీశ్ రావు సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఈ భేటీ జరిగింది.ఈనెల 6న వరంగల్‌లో నిర్వహించనున్న రైతు సభ నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. సభలో ప్రస్తావించాల్సిన ముఖ్య అంశాలపై ముగ్గురు నేతలు విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.ప్రధానంగా రైతులకు ఇచ్చిన హామీలు, ధాన్యం కొనుగోళ్లలో లోపాలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రైతు సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుని సభను విజయవంతం చేయాలన్న దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు.అలాగే వరంగల్ సభ అనంతరం చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలపై కూడా చర్చలు జరిగినట్లు సమాచారం. జిల్లాల వారీగా కలెక్టరేట్ల ముట్టడి, రహదారుల దిగ్బంధం వంటి చర్యలపై పార్టీ అగ్రనేతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ భేటీ అనంతరం తీసుకునే నిర్ణయాలపై మరింత స్పష్టత రానుంది. తెలంగాణ రాజకీయాల్లో ఈ సమావేశం కీలకంగా మారే అవకాశముంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి