Breaking News

బీఆర్ఎస్ నేతల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారంటూ సీఎం పై కేటీఆర్ విమర్శలు

సంగారెడ్డి, మే 04, (నేటి తెలుగు పత్రిక): మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకే మన్నే క్రిశాంక్‌ను అన్యాయంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారని ఆరోపించారు.సంగారెడ్డి కేంద్ర జైలుకు వెళ్లిన కేటీఆర్, జైలులో ఉన్న మన్నే క్రిశాంక్‌ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, క్రిశాంక్‌పై 35 కేసులు నమోదు చేసి ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు, జర్నలిస్టుల ఫోన్లను పోలీసులు హ్యాక్ చేస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు.రాష్ట్రంలో శాంతిభద్రతల కంటే రాజకీయ ప్రత్యర్థులపై చర్యలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రైవేట్ ఆర్మీలా పనిచేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.కరీంనగర్‌లో జరిగిన దోపిడీ ఘటనను ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో భద్రతా పరిస్థితులు దిగజారాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా పాలనపై దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు.

ఉత్తర–దక్షిణ రాజకీయాలకు ప్రజల చెక్: బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ హై అలర్ట్.. గోరక్షకులకు పోలీసుల కఠిన హెచ్చరికలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *