బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

తీరు మార్చుకోకపోతే వైసీపీకి గుండు సున్నా: మంత్రి నారాయణ హెచ్చరిక

తీరు మార్చుకోకపోతే వైసీపీకి గుండు సున్నా: మంత్రి నారాయణ హెచ్చరిక

నెల్లూరు, మే 04, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో గత ప్రభుత్వం భారీ అప్పుల భారం మోపిందని మంత్రి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. దస్తగిరి నగర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత పాలనలో పరిశ్రమలు వెళ్లిపోయి, రియల్ ఎస్టేట్ రంగం క్షీణించిందన్నారు.ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అప్పులు తగ్గిస్తూ అభివృద్ధి పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తోందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందన్నారు. లోకేశ్ కృషితో కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని, ఈ ఏడాది దేశవ్యాప్తంగా వచ్చిన పరిశ్రమల్లో గణనీయమైన వాటా ఆంధ్రప్రదేశ్‌కే దక్కిందని వివరించారు.పరిశ్రమల రాకతో రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని, ఉద్యోగ అవకాశాలు విస్తరిస్తాయని మంత్రి పేర్కొన్నారు. మహానాడు నిర్వహణపై వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.వైసీపీ తన వైఖరిని మార్చుకోకపోతే ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తారని, వచ్చే ఎన్నికల్లో గుండు సున్నా తప్పదని మంత్రి నారాయణ ఘాటుగా హెచ్చరించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్