బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

బెంగాల్ తీర్పుతో దేశవ్యాప్తంగా సంబరాలు: పీవీఎన్ మాధవ్

బెంగాల్ తీర్పుతో దేశవ్యాప్తంగా సంబరాలు: పీవీఎన్ మాధవ్

మే 05, (నేటి తెలుగు పత్రిక): మూడు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా విజయోత్సవాలు జరుపుకున్నాయి. విజయవాడలో నిర్వహించిన భారీ ర్యాలీ సందర్భంగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.భవానీపురంలోని సుజనా చౌదరి కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ, ప్రజలు బీజేపీపై ఉన్న నమ్మకంతో మూడు రాష్ట్రాల్లో పట్టం కట్టారని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పాలనకు ప్రజలు ముగింపు పలికారని విమర్శించారు.బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన శ్యామ ప్రసాద్ ముఖర్జీ పుట్టిన నేలపై ఈ విజయాన్ని సాధించడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వాలు ఏర్పడటం అభివృద్ధికి సంకేతమని అన్నారు.అస్సాంలో హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో విజయం సాధించామని, పుదుచ్చేరిలో కూడా మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. మైనారిటీలు బీజేపీకి దూరమనే అభిప్రాయాన్ని తిప్పికొడుతూ, అధిక ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాల్లో కూడా పార్టీ గెలిచిందని చెప్పారు.ఇక తమిళనాడులో నటుడు విజయ్ సాధించిన విజయాన్ని స్వాగతిస్తున్నామని, దేశవ్యాప్తంగా కొత్త రాజకీయ మార్పులకు ఇది సంకేతమని పేర్కొన్నారు.అమిత్ షా, సునీల్ బన్సల్ వంటి నాయకుల కృషి, కార్యకర్తల త్యాగాల వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని మాధవ్ అభినందించారు. ఈ విజయోత్సవ ర్యాలీ ద్వారా పార్టీ ఉత్సాహం మరింత పెరిగిందని బీజేపీ వర్గాలు తెలిపాయి.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్