బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అమరావతి రైతుల సమస్యలపై త్రీమెన్ కమిటీ సమావేశం: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

అమరావతి రైతుల సమస్యలపై త్రీమెన్ కమిటీ సమావేశం: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

మే 05, (నేటి తెలుగు పత్రిక): అమరావతిలో రాజధాని రైతుల సమస్యల పరిష్కారం కోసం సీఆర్డీఏ కార్యాలయంలో త్రీమెన్ కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సమావేశం గురించి వివరాలు వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు మరియు ఇతర కారణాల వల్ల ఈ మీటింగ్ కొంత ఆలస్యమైందని తెలిపారు.కొత్తగా సీఆర్‌డీఏ కమిషనర్‌గా విజయరామరాజు బాధ్యతలు స్వీకరించిన విషయం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. రాజధాని గ్రామాల సమస్యలు, ఎన్ఎస్పీ ప్రభావిత బాధితుల ఇళ్ల సమస్యలు ప్రధానంగా చర్చించబడ్డాయి. ఎఫ్‌ఎస్‌ఐ (FSI) అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించారు.రాజధాని ప్రాంతంలో గ్రామీణ రహదారులు మరియు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. మంత్రి నారాయణతో పాటు అధికారులు ఫీల్డ్ విజిట్‌లు చేపట్టి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవాలని నిర్ణయించారు.ఇకపై ప్రతి 2-3 వారాలకు రెగ్యులర్ సమావేశాలు నిర్వహించి, అంశాల వారీగా సమీక్ష చేస్తూ పరిష్కారాలపై నిరంతరం అప్డేట్లు ఇవ్వాలని అధికారులకు సూచించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్