బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

జీవో నెంబర్ 07 ను రద్దు చేయాలి.

జీవో నెంబర్ 07 ను రద్దు చేయాలి.

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య.

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నందికొండ రమేష్, జాయింట్ సెక్రటరీగా మేకల శ్రీధర్ నియామకం.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ముషీరాబాద్, మే 05(నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 07 ను వెంటనే రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ఏమాత్రం స్పష్టత లేదని దీనితో 14 లక్షల మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మేకల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యానగర్ బిసి భవన్ లో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్ తో కలిసి ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు.అనంతరం సంఘం రాష్ట్ర జనరల్ సెక్రెటరీగా నందికొండ రమేష్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా మేకల శ్రీధర్ ను నియమస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు విద్యార్థుల ఖాతాలో ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు జమ చేస్తారో స్పష్టత ఇవ్వకపోవడం దారుణమన్నారు. సర్కార్ నుండి నిధులు అందిన తర్వాతనే చెల్లిస్తామంటే కాలేజీ యాజమాన్యాలు అంగీకరించడం లేదని తెలిపారు. దీనితో ఫీజులు కడితేనే అడ్మిషన్లు ఇస్తామని యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయన్నారు. దీనితో పేద విద్యార్థుల తల్లిదండ్రులు అధిక వడ్డీకి అప్పులు తీసుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, ఫీజు నియంత్రణ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.