Breaking News

విద్యలో ఏఐ వినియోగంపై ఉన్నత స్థాయి కమిటీ సీఎం రేవంత్ రెడ్డి

మే 06, (నేటి తెలుగు పత్రిక): ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, సాంకేతిక మరియు వైద్య విద్య సిలబస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ కమిటీకి సంబంధించి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను కోరారు.జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన తెలంగాణ భవిష్యత్ ప్రణాళిక సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రఘురామ్ రాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఏఐ వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహించడంతో పాటు మధ్యస్థాయి ఉద్యోగాల కల్పన కోసం స్కిల్స్ యూనివర్సిటీలు, ఏటీసీలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సరైన విధంగా ఏఐను వినియోగిస్తే సమాజానికి విస్తృత ప్రయోజనాలు కలుగుతాయని రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. తమిళనాడు తరహా పారిశ్రామిక విధానం అమలు చేస్తే మరిన్ని పెట్టుబడులు ఆకర్షించవచ్చని సూచించారు.

మెదక్‌లో షాకింగ్ ఘటన.. శిశువును విక్రయించిన ఆరోగ్య సిబ్బంది అరెస్ట్

డేటా సెంటర్ల కోసం భారీగా విద్యుత్, నీటి వినియోగం అవసరమవుతుందని రాజన్ పేర్కొంటూ, మూడు నుంచి నాలుగు నెలల్లో హైదరాబాద్‌ను సందర్శించనున్నట్లు తెలిపారు. నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటే వివిధ రంగాల్లో విస్తృత ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, మానవ వనరుల అభివృద్ధి కోసం పోషకాహార లోపాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని సూచించారు.వ్యాపార సౌలభ్యంపై ప్రభుత్వ విధానాలు కీలకమని, స్టార్టప్‌లకు ప్రోత్సాహం పెంచితే ఆర్థికాభివృద్ధి మరింత వేగవంతమవుతుందని రాజన్ అభిప్రాయపడ్డారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి, మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచుతున్నామని, అంతర్జాతీయ విమానాశ్రయం, అవుటర్ రింగ్ రోడ్ వంటి సదుపాయాలు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు.రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించి అభివృద్ధి ప్రణాళికను అమలు చేస్తున్నామని, క్యూర్ (CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE) విధానాలతో ముందుకు సాగుతున్నామని వివరించారు. తెలంగాణ పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన సలహాలు ఇవ్వాలని రఘురామ్ రాజన్‌ను కోరారు.మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, తెలంగాణలో ఫార్మా, ఐటీ, డేటా సెంటర్ల రంగాలకు అనుకూల వాతావరణం ఉందని, వ్యాపార సౌలభ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు.ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు జయేష్ రంజన్, వాణీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

రైతుల సమస్యలను పట్టించుకోలేదని ప్రభుత్వంపై బండి సంజయ్ విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *