Breaking News

మెట్రో ఫేజ్-2 అనుమతుల కోసం ఢిల్లీకి సీఎం రేవంత్ పర్యటన

హైదరాబాద్, మే 06, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్ట్‌కు అనుమతులు సాధించేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీకి బయలుదేరారు. సాయంత్రం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో ఆయన భేటీ కానున్నారు.ఈ సమావేశంలో మెట్రో ఫేజ్-2 ప్రాజెక్ట్‌కు సంబంధించిన అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని సీఎం విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే మెట్రో ఫేజ్-1ను రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్న అంశాన్ని కూడా కేంద్రమంత్రికి వివరించనున్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. ఈ దశలో మొత్తం 7 కారిడార్లను ప్రతిపాదిస్తూ, 122.9 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణకు ప్రణాళిక సిద్ధం చేసింది. మొత్తం 86 స్టేషన్ల నిర్మాణం చేపట్టనుండగా, ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.38,595 కోట్లుగా నిర్ణయించారు.ప్రస్తుతం మెట్రో ఫేజ్-1 నెట్‌వర్క్ 69.2 కిలోమీటర్లుగా ఉండగా, ఫేజ్-2 పూర్తయిన తర్వాత మొత్తం నెట్‌వర్క్ 191.9 కిలోమీటర్లకు పెరగనుంది.ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా మధ్యాహ్నం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో కూడా సీఎం భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

మెదక్‌లో షాకింగ్ ఘటన.. శిశువును విక్రయించిన ఆరోగ్య సిబ్బంది అరెస్ట్

రైతుల సమస్యలను పట్టించుకోలేదని ప్రభుత్వంపై బండి సంజయ్ విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *