బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

సురేఖ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.. బీజేపీ నేతల తీవ్ర విమర్శలు

సురేఖ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.. బీజేపీ నేతల తీవ్ర విమర్శలు

జనగామ/హైదరాబాద్, మే 06, (నేటి తెలుగు పత్రిక): మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేగింది. ‘‘జై శ్రీరాం అంటే డబ్బులు వస్తాయా?’’ అనే వ్యాఖ్యలతో హిందువులను కించపరిచారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ ఎం. రఘునందన్‌రావు తీవ్రంగా స్పందించారు. ‘‘జై కాంగ్రెస్‌, జై సోనియా, జై రాహుల్ గాంధీ అంటే డబ్బులు వస్తాయా?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.జనగామలో మాట్లాడిన రఘునందన్‌రావు, కాంగ్రెస్ పార్టీ హిందువుల వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు. శ్రీరామ నామంపై మంత్రి చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని అన్నారు. రాముడిని విమర్శించిన పలువురు నేతలు దేశంలో ప్రాధాన్యం కోల్పోయారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కాకతీయ ప్రాంతంలో కాషాయ జెండా ఎగురవేస్తామని, ఈనెల 10న సికింద్రాబాద్‌లో జరిగే సభ దానికి నిదర్శనమవుతుందని తెలిపారు.బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ కూడా స్పందిస్తూ, భక్తిని డబ్బుతో కొలవడం కాంగ్రెస్ సంస్కృతి అని విమర్శించారు. రామనామం విలువ కాంగ్రెస్ నాయకులకు తెలియదని మండిపడ్డారు. ఇక వీహెచ్‌పీ నేత పగుడాకుల బాలస్వామి మాట్లాడుతూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన మంత్రి సురేఖ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి దేవుళ్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి