బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

బిల్లు అడిగితే బీభత్సం.. మల్కాజ్‌గిరిలో రౌడీషీటర్ల దాడి

బిల్లు అడిగితే బీభత్సం.. మల్కాజ్‌గిరిలో రౌడీషీటర్ల దాడి

హైదరాబాద్, మే 06, (నేటి తెలుగు పత్రిక): మల్కాజ్‌గిరిలోని ఓ రెస్టారెంట్‌లో బిల్లు చెల్లించమన్నందుకు రౌడీషీటర్లు సిబ్బందిపై మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో పలువురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 2న జరిగిన ఘటనలో, కత్తులు, కర్రలతో రౌడీషీటర్లు రెస్టారెంట్ యాజమాన్యం, సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఘటన సమయంలో పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ దుండగులు దాడి చేయడం ఆందోళన కలిగిస్తోంది.బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన అధికారులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధాన నిందితులుగా ఏదుల ప్రసన్ రెడ్డి, ఏదుల యశ్వంత్ రెడ్డి పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిపై పలు నేర కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ఇద్దరూ గతంలో వనస్థలిపురంలో ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో కూడా ప్రమేయం ఉన్నట్లు విచారణలో బయటపడింది. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో శోధన కొనసాగిస్తున్నారు.నిందితుల నుంచి తమకు ప్రాణహాని ఉందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తూ, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి