బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కవిత రాజకీయ వ్యూహానికి కొత్త బలం – ప్రశాంత్ కిషోర్ సలహాదారుగా చేరనున్నట్లు చర్చ

కవిత రాజకీయ వ్యూహానికి కొత్త బలం – ప్రశాంత్ కిషోర్ సలహాదారుగా చేరనున్నట్లు చర్చ

మే 06, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత కొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆమెకు వ్యక్తిగత రాజకీయ సలహాదారుగా పని చేయనున్నారని సమాచారం.అక్టోబర్ నుంచి పీకే తన పనిని ప్రారంభించి, కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీకి ఎన్నికల వ్యూహరచనలో మార్గదర్శనం చేయనున్నారని ప్రచారం సాగుతోంది. ప్రత్యేకంగా క్షేత్రస్థాయి బలాన్ని పెంచడం, సోషల్ మీడియాలో ప్రభావాన్ని విస్తరించడం వంటి అంశాలపై ఆయన దృష్టి సారించనున్నారని తెలుస్తోంది.ఈసారి పీకే తన ఐ-ప్యాక్ టీంతో కాకుండా వ్యక్తిగత స్థాయిలో మాత్రమే సలహాలు ఇవ్వనున్నారని సమాచారం. కవిత ఇప్పటికే సోషల్ మీడియా వ్యూహాలపై దృష్టి పెట్టగా, పీకే చేరికతో ఆ ప్రయత్నాలు మరింత వేగం అందుకుంటాయని భావిస్తున్నారు.అయితే ఈ ఒప్పందంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. రాజకీయ వర్గాల్లో మాత్రం ఇది కవిత భవిష్యత్ రాజకీయ ప్రణాళికల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి