బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

కిశోరి బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి: ఎస్ రాజేశ్వరి

కిశోరి బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి: ఎస్ రాజేశ్వరి

పామర్రు, మే 06, (నేటి తెలుగు పత్రిక): సమాజంలో యుక్త వయసులో గల బాలికలు తమ ప్రతిభ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని అంగన్వాడి కేంద్ర నిర్వాహకురాలు ఎస్ రాజేశ్వరి పేర్కొన్నారు. కిషోరి వికాస కార్యక్రమంలో భాగంగా పామర్రు నియోజకవర్గ పరిధిలోని పమిడిముక్కల మండలం కపి లేశ్వరపురం సెక్టార్ పరిధిలోని మంటాడ 3 వ అంగన్వాడి కేంద్రంలో బుధవారం వేసవి శిక్షణ శిబిరాన్ని ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హాక్కులు లైంగిక వేధింపుల నుంచి రక్షణ,లింగ అసమానత, సైబర్ రక్షణ, మహిళా సాధికారత తదితరాంశాలపై కిషోరి బాలికల కు అవగాహన కల్పించారు.రక్తహీనత వల్ల జరిగే అనర్ధాలను రాజేశ్వరి వివరించారు. జూన్ 9 వరకు నిర్వహించే ఈ వేసవి శిబిరాలను అంగన్వాడి పరిధిలో గల కిషోరి బాలికలు వినియోగించుకో వాలని కోరారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలోఅంగన్వాడీ పరిధిలోని కిశోరి బాలికలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్