బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

బాధితులకు త్వరిత న్యాయం కోసం సమన్వయం అవసరం: రాయపాటి శైలజ

బాధితులకు త్వరిత న్యాయం కోసం సమన్వయం అవసరం: రాయపాటి శైలజ

విజయవాడ,మే 06, (నేటి తెలుగు పత్రిక): మానవ అక్రమ రవాణా బాధితులకు త్వరగా న్యాయం అందించాలంటే అన్ని విభాగాలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని రాయపాటి శైలజ పేర్కొన్నారు. పరిహారం చెల్లింపులో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అమరావతిలో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో మాట్లాడిన ఆమె.. పరిహారం చెల్లింపులో అర్హత నిర్ధారణ, నిధుల విడుదలలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించినట్లు చెప్పారు. పెండింగ్ కేసులు, బడ్జెట్ అవసరాలపై జిల్లా అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని వెల్లడించారు.బాధితుల పునరావాసం కోసం హెల్ప్ సంస్థతో పాటు ఇతర ప్రతినిధుల సూచనలు కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు. చట్టపరమైన చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు సూచనలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తే బాధితులకు త్వరగా న్యాయం జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్