బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

ఆపరేషన్ సింధూర్ వీరులకు ప్రధాని మోదీ అభినందనలు

ఆపరేషన్ సింధూర్ వీరులకు ప్రధాని మోదీ అభినందనలు

మే 07, (నేటి తెలుగు పత్రిక): ఆపరేషన్ సింధూర్‌కు ఏడాది పూర్తైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారత సైన్యం ధైర్యసాహసాలను కొనియాడారు. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల కోసం చేపట్టిన ఈ ఆపరేషన్ దేశ భద్రతా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో శత్రువులను ఎదుర్కొన్న ప్రతి సైనికుడికి దేశం రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ ద్వారా దేశ ప్రజల్లో భద్రతా భావన మరింత బలపడిందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని తన సామాజిక మాధ్యమ ఖాతాలో ఆపరేషన్ సింధూర్ చిహ్నాన్ని ప్రొఫైల్ చిత్రంగా మార్చారు. భారత వాయుసేన విడుదల చేసిన ప్రత్యేక వీడియో కూడా ప్రజల్లో దేశభక్తిని రగిలిస్తోంది. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్ సమీపంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మే 7న ఈ ఆపరేషన్ చేపట్టింది. పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దళాలు విజయవంతంగా దాడులు నిర్వహించాయి.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ