Breaking News

శ్రీసిటీలో క్యారియర్ సంస్థ భారీ పెట్టుబడి: సీఎం చంద్రబాబు

మే 07, (నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ సంస్థ క్యారియర్ శ్రీసిటీలో అత్యాధునిక చిల్లర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్ర పారిశ్రామిక రంగంలో మరో కీలక ముందడుగు పడిందని అన్నారు. సుమారు రూ.863 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న ఈ ప్లాంట్‌లో హైఎండ్ కమర్షియల్ హెచ్‌వీఏసీ చిల్లర్లను తయారు చేయనున్నారు. పరిశోధన, అభివృద్ధి కోసం 15 ఆధునిక టెస్టింగ్ ల్యాబ్‌లను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా డేటా సెంటర్లు, ఆధునిక పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు మరింత బలోపేతం అవుతాయని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ఈ పెట్టుబడి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు సాధనలో కీలక పాత్ర పోషించిన మంత్రి నారా లోకేశ్‌ను సీఎం అభినందించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *