బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

జూబ్లీహిల్స్ ఇన్‌స్టాగ్రామ్ ట్రాప్ కేసులో వెలుగుచూసిన సంచలనాలు

జూబ్లీహిల్స్ ఇన్‌స్టాగ్రామ్ ట్రాప్ కేసులో వెలుగుచూసిన సంచలనాలు

మే 07, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ ఇన్‌స్టాగ్రామ్ ట్రాప్ కేసులో పోలీసులు కీలక విషయాలను బయటపెట్టారు. మైనర్ బాలికలను సోషల్ మీడియా ద్వారా వలలో వేసి డబ్బులు వసూలు చేస్తున్న నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగుతోంది.పోలీసుల రిమాండ్ రిపోర్టు ప్రకారం.. ప్రధాన నిందితుడు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాలికతో పరిచయం పెంచుకుని, తర్వాత ఆమెను బెదిరింపులకు గురి చేసినట్లు గుర్తించారు. గతంలో పోక్సో కేసులో అరెస్టైన అర్జున్ బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కూడా బాలికతో తిరిగి సంప్రదింపులు కొనసాగించినట్లు సమాచారం.ఈ కేసులో ఇంటి పనిమనిషి సరస్వతి పాత్ర కూడా వెలుగులోకి వచ్చింది. బాలిక వ్యక్తిగత విషయాలు బయటపెడతానంటూ బెదిరించి రూ.9 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో అర్జున్ బాధితురాలి నుంచి సుమారు రూ.13 లక్షలు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలిందిడబ్బులు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో అర్జున్ తల్లి ఖాతాల్లోకి కూడా డబ్బులు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. మరో యువతి కూడా అర్జున్‌పై ఫిర్యాదు చేయడంతో కేసు మరింత కీలకంగా మారింది.సోషల్ మీడియా ద్వారా మైనర్లను లక్ష్యంగా చేసుకునే మోసాలపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి