Breaking News

హైడ్రాపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు – నాదర్గుల్ భూ వివాదం వేడెక్కింది

మే 07, (నేటి తెలుగు పత్రిక): రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ పరిధిలోని సర్వే నంబర్ 613లో ఉన్న సుమారు 373 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోందని రైతులు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావును కలిసి ఫిర్యాదు చేశారు. రియల్ ఎస్టేట్ మాఫియా కంచెలు వేసి భూములను ఆక్రమిస్తోందని, తమపై దాడులు జరుగుతున్నాయని, వ్యవసాయ బోర్లు ధ్వంసం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.రైతుల సమస్యలు విన్న హరీశ్ రావు వెంటనే సంబంధిత జిల్లా కలెక్టర్, సీపీ, ఆర్డీవో, ఎమ్మార్వోలకు ఫోన్ చేసి కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన బాధ్యత అధికారులదేనని ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా హరీశ్ రావు హైడ్రా వ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ భూములు, చెరువులు కాపాడేందుకు హైడ్రా ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెబుతుండగా, పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు అక్రమంగా భూములు ఆక్రమిస్తున్నా ఎందుకు చర్యలు లేవని ప్రశ్నించారు. “హైడ్రా కేవలం పేదల ఇళ్లను కూల్చడానికేనా?” అని ఆయన నిలదీశారు. అక్రమ కబ్జాలపై అధికారులు మౌనం వహిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల అండదండలతోనే ఈ వ్యవహారం సాగుతోందని ఆరోపించారు. తక్షణమే కంచెలు తొలగించి రైతులకు సాగు హక్కులు కల్పించాలని, చెరువులు, ఫీడర్ ఛానల్స్ రక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.ఎమ్మార్వో, పోలీస్ అధికారులతో కూడా ఆయన మాట్లాడి, అక్రమంగా ప్రవేశించిన వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. రైతులపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీకి విజ్ఞప్తి చేశారు. న్యాయం జరగకపోతే తానే స్వయంగా బీఆర్‌ఎస్ బృందంతో అక్కడికి వెళ్తానని హరీశ్ రావు హెచ్చరించారు. దీంతో తమకు న్యాయం జరుగుతుందన్న ఆశ ఉందని రైతులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ రవాణా శాఖకు గడ్కరీ ప్రశంసలు.. దేశానికి ఆదర్శమన్న కేంద్ర మంత్రి

జై శ్రీరామ్ వ్యాఖ్యలతో రాజకీయ రగడ.. కొండా సురేఖపై రాజాసింగ్ ఆగ్రహం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *