బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

తెలంగాణ రవాణా శాఖకు గడ్కరీ ప్రశంసలు.. దేశానికి ఆదర్శమన్న కేంద్ర మంత్రి

తెలంగాణ రవాణా శాఖకు గడ్కరీ ప్రశంసలు.. దేశానికి ఆదర్శమన్న కేంద్ర మంత్రి

మే 07, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రవాణా శాఖ పనితీరుపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు లేఖ రాసి అభినందనలు తెలిపారు. రవాణా రంగంలో తెలంగాణ తీసుకుంటున్న సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.ప్రత్యేకంగా రాష్ట్రంలో చెక్‌పోస్టుల రద్దు నిర్ణయాన్ని గడ్కరీ ప్రశంసించారు. ఈ చర్య వల్ల రవాణా వ్యవస్థలో పారదర్శకత పెరిగిందని, ప్రజలకు సౌకర్యం కలిగిందని అభిప్రాయపడ్డారు. అలాగే VAHAN, SARATHI సేవల సమీకరణను సమర్థవంతంగా అమలు చేయడంపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్‌ల ఏర్పాటు, రోడ్డు భద్రత చర్యల్లో తెలంగాణ ముందంజలో ఉందని గడ్కరీ కొనియాడారు. డిజిటల్ గవర్నెన్స్‌ను విస్తృతంగా అమలు చేస్తూ ప్రజలకు వేగవంతమైన సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు.రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రవాణా శాఖ పనితీరు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటోందని ఆయన అన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి