Breaking News

రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా విస్తరణ.. కబ్జాలపై కఠిన చర్యలు: రంగనాథ్

మే 07, (నేటి తెలుగు పత్రిక): హైడ్రాను తెలంగాణ వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి హైడ్రా సేవలు కావాలంటూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయని తెలిపారు.మిర్యాలగూడ పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడిన రంగనాథ్.. భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు వేల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. ప్రజల ఆస్తులను రక్షించడం, ప్రభుత్వ భూములను కాపాడడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకే నాలుగు వారాల పాటు ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశామని తెలిపారు. హైడ్రా చర్యలకు వ్యతిరేకంగా కొందరు కోర్టులను ఆశ్రయిస్తున్నప్పటికీ, చట్టబద్ధంగానే ముందుకు వెళ్తున్నామని చెప్పారు.ఇప్పటివరకు సుమారు రూ.85 వేల కోట్ల విలువైన భూములను కబ్జాల నుంచి రక్షించామని రంగనాథ్ వెల్లడించారు. మరో ఏడాదిలో లక్ష కోట్ల రూపాయల విలువైన భూములను కాపాడే లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు.హైడ్రా పరిధిలోనే దాదాపు రూ.10 లక్షల కోట్ల విలువైన భూములు అక్రమ కబ్జాలకు గురైనట్లు తమ వద్ద సమాచారం ఉందని తెలిపారు. అక్రమాలపై ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

విజయ్‌ను రాజకీయంగా అడ్డుకునే కుట్ర జరుగుతోంది: పోసాని కృష్ణమురళి

డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. మళ్లీ పట్టుబడితే పీడీ యాక్ట్: డీజీపీ సీవీ ఆనంద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *