బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

వట్టిచెరుకూరులో తేజు ఫిలిమ్స్ సినిమా షూటింగ్ పూర్తి

వట్టిచెరుకూరులో తేజు ఫిలిమ్స్ సినిమా షూటింగ్ పూర్తి

మే 08, (నేటి తెలుగు పత్రిక): గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు గ్రామంలో తేజు ఫిలిమ్స్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.1 చిత్ర రెండో షెడ్యూల్ షూటింగ్ విజయవంతంగా పూర్తైంది. నిర్మాత సంతోష్ రావు బల్గూరి ఆధ్వర్యంలో గ్రామ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, దేవాలయ ప్రాంగణంలో క్లాప్‌తో చిత్రీకరణ ప్రారంభించారు.ఈ సందర్భంగా దర్శకుడు సుధాకర రెడ్డి మాట్లాడుతూ.. వట్టిచెరుకూరులో చెరువు, రచ్చబండ, శివాలయం, రామాలయం, పంట పొలాలు, కళ్లాలు వంటి సహజ వాతావరణం ఒకేచోట లభించడం షూటింగ్‌కు ఎంతో అనుకూలంగా మారిందన్నారు. రైతుల జీవన విధానం, వ్యవసాయం నేపథ్యంగా సాగే కథకు ఈ గ్రామం పూర్తిగా సరిపోయిందని తెలిపారు. గ్రామ పెద్దలు అందించిన సహకారం అభినందనీయమన్నారు.తదుపరి షూటింగ్ అమరావతి, తాళాయపాలెం శైవక్షేత్రం, హైదరాబాద్ ప్రాంతాల్లో జరగనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో ఎన్.ఎస్. నాయుడు, అరుణ, పావులూరి హరినాధ్ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రవీంద్రనాథ్, అప్పారావు, వెంకటేశ్వర్లు, కల్లూరి ఆచారి, దాడి శంకర్ రావు, సత్య ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పవన్, మౌనిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.చిత్రానికి జగపతి శ్రీనివాస్ కథ అందించగా, ఎస్.ఏ.టి. శ్రీధర్ పీఆర్‌వోగా వ్యవహరిస్తున్నారు. దాసరి రవికుమార్ కెమెరామెన్‌, ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి.డి సహ నిర్మాతగా ఉన్నారు. నిర్మాత సంతోష్ రావు బల్గూరి కాగా, కథా-దర్శకత్వ బాధ్యతలను సుధాకర రెడ్డి నిర్వహిస్తున్నారు.త్వరలో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?