బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

నైపుణ్యంతోనే ఉద్యోగాలు సాధ్యం: మంత్రి కొండా సురేఖ

నైపుణ్యంతోనే ఉద్యోగాలు సాధ్యం: మంత్రి కొండా సురేఖ

మే 08, (నేటి తెలుగు పత్రిక): యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండి నిబద్ధతతో ముందుకు సాగాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. ప్రతిభ, నైపుణ్యాల ఆధారంగానే ఉద్యోగ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ఉద్యోగాల్లో మహిళలకు మరింత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.హనుమకొండలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాను మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాగరాజు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, కలెక్టర్ సత్యశారదదేవి తదితరులు పాల్గొన్నారు.మెగా జాబ్‌మేళాకు భారీ సంఖ్యలో నిరుద్యోగ యువత హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుత తరం యువతలో అనేక మార్పులు వచ్చాయని అన్నారు. సమాజంలో పోటీ పెరిగిందని, అందుకే యువత తమ ప్రతిభను మెరుగుపరుచుకోవాలని సూచించారు.“మనం తప్పు చేయనంతవరకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు” అని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. మత్తుపదార్థాలకు బానిసైతే భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు. కష్టపడి పనిచేస్తేనే విజయాలు సాధ్యమవుతాయని చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్‌మేళాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తోందని మంత్రి వెల్లడించారు. ప్రైవేట్ రంగంలో కూడా యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి