బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

హైదరాబాద్‌లో ఆటోలను ఈవీలుగా మార్చేందుకు ప్రభుత్వ ప్రణాళిక : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లో ఆటోలను ఈవీలుగా మార్చేందుకు ప్రభుత్వ ప్రణాళిక : సీఎం రేవంత్ రెడ్డి

మే 09, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు నగరంలోని ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. కోర్ అర్బన్ రీజియన్‌లో నడిచే ఆటోలకు ప్రభుత్వ నిధులతో రెట్రో ఫిట్టింగ్ నిర్వహించేందుకు ఐదు కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.హైదరాబాద్ నాంపల్లిలోని హజ్ హౌజ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం హజ్–2026 యాత్రకు బయలుదేరే యాత్రికుల బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, అసదుద్దీన్ ఓవైసీ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి హజ్ యాత్రకు వెళ్తున్న యాత్రికులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలిపారు. మైనారిటీల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.హిందూ–ముస్లింలు తనకు రెండు కళ్లలాంటి వారని, ఇద్దరూ అన్నదమ్ముల్లా కలిసి తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో మైనారిటీల భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో వైట్ కాలర్ ఉద్యోగాలకు సవాళ్లు పెరుగుతున్నాయని, అందుకే యువత నైపుణ్య శిక్షణపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఏటీసీ, పాలిటెక్నిక్, స్కిల్స్ యూనివర్సిటీ వంటి సంస్థల్లో శిక్షణ పొందాలని విద్యార్థులకు సూచించారు. అమెరికా, మిడిల్ ఈస్ట్‌తో పాటు జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా దేశాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని పేర్కొంటూ యువత తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కోరారు.ఇరాన్ యుద్ధ పరిస్థితుల కారణంగా ఇంధన ధరలు పెరిగి హజ్ యాత్రికులపై అదనపు భారం పడిందని సీఎం తెలిపారు. ఒక్కో యాత్రికుడిపై పడిన అదనపు రూ.10 వేల భారం కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో 7 వేల మంది హాజీలపై వచ్చిన అదనపు వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించారు.గత ఏడాది హజ్ యాత్ర సమయంలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన 44 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేశామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి