బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

మాజీ ఐపీఎస్ భార్య హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం

మాజీ ఐపీఎస్ భార్య హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం

మే 09, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.పని మనిషి కల్పనతో పాటు ఆమెకు సహకరించిన మరో ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా 10 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ముంబై, ఢిల్లీ, లక్నోతో పాటు నేపాల్‌కు కూడా పోలీసు బృందాలు వెళ్లినట్లు సమాచారం. గతంలో లక్నోలో కల్పన పని చేసిన ఇంటి యజమానులను పోలీసులు విచారించగా, తమ ఇంట్లోనూ బంగారం, నగదు మాయమైనట్లు వారు వెల్లడించినట్టు తెలిసింది. దీంతో ఆమెపై పాత కేసుల కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.హత్య అనంతరం నిందితులు నాంపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మాజీ ఐపీఎస్ నివాసం, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నారు.ఇవాళ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో తనూజ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఆమె మృతదేహానికి నివాళులు అర్పించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి