మే 09, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన కోల్‌కతాకు బయలుదేరారు.ఉదయం 7:05 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబు, అక్కడి నుంచి 7:40 గంటలకు విమానంలో కోల్‌కతాకు ప్రయాణించారు. ఉదయం 9:20 గంటలకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు.అనంతరం బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌కు రోడ్డుమార్గంలో వెళ్లి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ కార్యక్రమం జరగనుంది.మధ్యాహ్నం 1:45 గంటలకు కోల్‌కతా నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు రానున్నారు. 3:45 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, అనంతరం జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్లనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.
