బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

డిప్యూటీ సీఎం చొరవతో మస్కట్ నుంచి స్వగ్రామానికి షెహనాజ్

డిప్యూటీ సీఎం చొరవతో మస్కట్ నుంచి స్వగ్రామానికి షెహనాజ్

మే 09, (నేటి తెలుగు పత్రిక): డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలానికి చెందిన షెహనాజ్ మస్కట్ నుంచి సురక్షితంగా స్వగ్రామానికి చేరుకుంది.కుటుంబ జీవనం కోసం ఏజెంట్ ద్వారా మస్కట్ వెళ్లిన షెహనాజ్ అక్కడ పని చేస్తూ తీవ్ర వేధింపులకు గురైనట్లు తెలిపింది. జీతం ఇవ్వకపోవడం, దుర్వ్యవహారం ఎదురవుతున్న పరిస్థితిని భర్తకు వీడియో కాల్ ద్వారా తెలియజేసింది. తనను రక్షించాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కూడా వేడుకుంది.విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ తన కార్యాలయ అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అధికారులు రాయబార కార్యాలయంతో సమన్వయం చేసి షెహనాజ్‌ను రప్పించారు.మస్కట్ నుంచి ముంబై, అక్కడి నుంచి విజయవాడ మీదుగా వాల్మీకిపురం వరకు ఆమెను సురక్షితంగా తీసుకువచ్చారు. ఈ ప్రక్రియ కేవలం ఐదు రోజుల్లో పూర్తయింది. స్వగ్రామానికి చేరుకున్న అనంతరం డిప్యూటీ సీఎం పేషీ అధికారులు షెహనాజ్‌కు రూ.30,000 నగదు, చీర అందజేశారు. ఆమెకు అవసరమైన సహాయాన్ని కూడా అందించారు.తనను కష్టాల నుంచి రక్షించి స్వగ్రామానికి చేర్చినందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డికి షెహనాజ్ కృతజ్ఞతలు తెలిపింది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్