బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఇక ఆర్టీవో చుట్టూ తిరగాల్సిన పనిలేదు.. 17 లైసెన్స్ సేవలు ఆన్‌లైన్‌లోనే

ఇక ఆర్టీవో చుట్టూ తిరగాల్సిన పనిలేదు.. 17 లైసెన్స్ సేవలు ఆన్‌లైన్‌లోనే

మే 09, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ వాహనదారులకు భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన 17 కీలక సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొస్తూ ‘ఫేస్‌లెస్’ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో ప్రజలు ఇకపై చిన్నచిన్న సేవల కోసం ఆర్టీవో కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే సేవలు పొందగలుగుతారు.ఈ విషయాన్ని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ కె. ఇలంబరితి వెల్లడించారు. ఆధార్ ఆధారిత ధ్రువీకరణతో సేవలను పూర్తిగా డిజిటల్ విధానంలో అందిస్తున్నామని తెలిపారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.ఈ ఫేస్‌లెస్ విధానంలో లెర్నర్ లైసెన్స్‌లో పేరు, చిరునామా, ఫొటో, సంతకం మార్పులు, డూప్లికేట్ లెర్నర్ లైసెన్స్ సేవలు అందుబాటులో ఉంటాయి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, పుట్టిన తేదీ సవరణ, బయోమెట్రిక్ వివరాల మార్పులు వంటి సేవలను కూడా పూర్తిగా ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చారు.ఇప్పటివరకు ఈ సేవల కోసం ఆర్టీవో కార్యాలయాలకు పలుమార్లు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు కంప్యూటర్ లేదా మొబైల్ ద్వారానే దరఖాస్తు చేసి సేవలను పొందే అవకాశం కల్పించారు. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు, వృద్ధులకు పెద్ద ఎత్తున ఉపశమనం లభించనుంది.ఈ విధానం వల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గి అవినీతి అవకాశాలు కూడా తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. సేవలలో పారదర్శకత పెరగడంతో పాటు ప్రజల సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయని చెబుతున్నారు.సేవలను పొందేందుకు పౌరులు సారథి పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని రవాణా శాఖ సూచించింది. అవసరమైన పత్రాలను కూడా ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ చేసే సౌకర్యం కల్పించారు.డిజిటల్ సేవలను మరింత విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేపథ్యంలో, రవాణా శాఖ తీసుకొచ్చిన ఈ ‘ఫేస్‌లెస్’ విధానం కీలక మైలురాయిగా నిలవనుంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి