బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

టిప్పు సుల్తాన్ పేరు వివాదంతో కడపలో ఉద్రిక్తత

టిప్పు సుల్తాన్ పేరు వివాదంతో కడపలో ఉద్రిక్తత

మే 09, (నేటి తెలుగు పత్రిక): కడప నగరంలోని ఆల్మాస్‌పేట సర్కిల్ వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్కిల్‌కు టిప్పు సుల్తాన్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఒక వర్గం ఆందోళనకు దిగగా, అదే పేరును కొనసాగించాలని మరో వర్గం నిరసన చేపట్టింది. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఆల్మాస్‌పేట సర్కిల్‌ను “హనుమాన్ సర్కిల్”గా మార్చాలని ఒక వర్గం డిమాండ్ చేసింది. మరోవైపు ఇప్పటికే ఉన్న టిప్పు సుల్తాన్ పేరును తొలగించకూడదంటూ మరో వర్గం రోడ్డెక్కింది. ఇరువర్గాల మద్దతుదారులు భారీగా అక్కడికి చేరుకోవడంతో ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుండగా, కొంతమంది ఆందోళనకారులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో తాలూకా సీఐ నరసింహారావుతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడినట్లు సమాచారం.పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జి నిర్వహించి ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం ఆ ప్రాంతంలో అదనపు పోలీసు బలగాలను మోహరించి భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.ఈ ఘటనతో కడపలో రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చ మొదలైంది. సర్కిల్ పేరుమార్పు అంశం మరింత వివాదానికి దారితీయకుండా అధికారులు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్