Breaking News

విజయ్ ప్రభుత్వానికి అస్థిరత?.. వేణుస్వామి సంచలన జోస్యం

మే 09, (నేటి తెలుగు పత్రిక): ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తమిళనాడు రాజకీయ భవిష్యత్తు, నటుడు విజయ్ రాజకీయ ప్రస్థానంపై ఆయన చేసిన జోస్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తాజాగా మాట్లాడుతూ, విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినా అది ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చని వేణుస్వామి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర జాతకంలో గ్రహస్థితుల ప్రభావం కారణంగా రాజకీయ అస్థిరత తలెత్తే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలల్లోనే మళ్లీ ఎన్నికల పరిస్థితి రావచ్చని వ్యాఖ్యానించారు.విజయ్ వ్యక్తిగత జీవితంపై కూడా వేణుస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ త్రిషతో విజయ్‌కు ప్రత్యేక అనుబంధం ఉందని పేర్కొంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. అయితే ఆయన వ్యాఖ్యల అర్థంపై నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇక పశ్చిమ బెంగాల్ రాజకీయాలపై కూడా వేణుస్వామి స్పందించారు. అక్కడ రాజకీయ ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని, భవిష్యత్తులో కీలక పరిణామాలు చోటుచేసుకోవచ్చని జోస్యం చెప్పారు.వేణుస్వామి వ్యాఖ్యలను కొందరు ఆసక్తిగా తీసుకుంటుండగా, మరికొందరు మాత్రం ఇవి కేవలం జ్యోతిష్య విశ్లేషణలేనని అంటున్నారు. మరోవైపు విజయ్ అభిమానులు మాత్రం “ప్రజా మద్దతే అసలైన శక్తి” అంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *