బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జలవనరుల శాఖకు శశి భూషణ్ కుమార్

ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జలవనరుల శాఖకు శశి భూషణ్ కుమార్

అమరావతి, మే 09, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక పరిపాలనా మార్పులు చోటుచేసుకున్నాయి. పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశి భూషణ్ కుమార్‌కు ఇకపై జలవనరుల శాఖ బాధ్యతలను కూడా అదనంగా అప్పగించారు. ఈ కీలక బాధ్యతల మార్పుతో జలవనరుల శాఖలో పాలన మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.అలాగే, జలవనరుల శాఖ స్పెషల్ సీఎస్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సాయి ప్రసాద్‌కు ఆ బాధ్యతల నుంచి రిలీఫ్ ఇచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు పర్యావరణ, అటవీ శాఖ ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండేకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. పరిపాలనా సమన్వయం మెరుగుపరచడమే ఈ మార్పుల ఉద్దేశమని అధికారులు తెలిపారు.ఈ బదిలీలకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని స్పష్టం చేస్తూ జీఓ ఆర్టీ నెంబర్ 918ను ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ జారీ చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్