బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
క్రైమ్ న్యూస్

హనీట్రాప్ ఆరోపణలతో కలకలం.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు

హనీట్రాప్ ఆరోపణలతో కలకలం.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు

మే 10, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయ వర్గాల్లో హనీట్రాప్ ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ తనను ఓ కుటుంబం హనీట్రాప్ చేసి డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేస్తోందంటూ పోలీసులను ఆశ్రయించారు.హైదరాబాద్‌ కొంపల్లికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడిందని, ఆ సాన్నిహిత్యాన్ని అడ్డంగా పెట్టుకుని ఆమె కుటుంబ సభ్యులు తనపై ఒత్తిడి తెస్తున్నారని భగీరథ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో పాటు, నిరాకరిస్తే ఫోటోలు, వీడియోలు బయటపెడతామని బెదిరించారని ఆరోపించారు.ఈ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని, ఇప్పటికే కొంత మొత్తం కూడా చెల్లించినట్లు భగీరథ్ తెలిపారు. వేధింపులు ఎక్కువ కావడంతో చివరకు పోలీసులను ఆశ్రయించినట్లు వెల్లడించారు.అయితే ఈ కేసులో మరో మలుపు చోటుచేసుకుంది. భగీరథ్‌పై యువతి కుటుంబ సభ్యులు కూడా ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె మైనర్ అని, ఆమెపై వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.ఇద్దరు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటుండటంతో పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాల్ డేటా, బ్యాంక్ లావాదేవీలు, సోషల్ మీడియా చాటింగ్స్‌ వంటి సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నారు. యువతి మైనరా కాదా అనే అంశంపై కూడా అధికారులు ధ్రువీకరణ చేపట్టారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి