బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

లవ్ యూ అమ్మా: మంత్రి నారా లోకేశ్

లవ్ యూ అమ్మా: మంత్రి నారా లోకేశ్

మే 10, (నేటి తెలుగు పత్రిక): మదర్స్‌డే సందర్భంగా ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన తల్లి నారా భువనేశ్వరికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. తన ఎక్స్‌ ఖాతా వేదికగా భావోద్వేగ సందేశం పోస్టు చేస్తూ మహిళల గౌరవం, తల్లి పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు.“మనల్ని ఈ లోకానికి పరిచయం చేసిన అమ్మకు చెప్పలేని పని ఎప్పుడూ ఎవ్వరూ చేయొద్దు. అదే ప్రతి తల్లి కోరుకునే గొప్ప కానుక” అంటూ లోకేశ్ పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచే మహిళలను గౌరవించడం, స్త్రీ పురుషులు సమానమనే భావన తనలో పెంపొందించిందీ తన తల్లేనని చెప్పారు.తన తల్లి స్ఫూర్తితోనే విద్యాశాఖలో నైతిక విలువల పాఠాలను ప్రవేశపెట్టామని వెల్లడించారు. మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘స్త్రీ శక్తి’ పేరుతో ఉచిత బస్సు ప్రయాణం, ‘దీపం-2’ పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తోందని గుర్తుచేశారు.“బిడ్డలకు గురువు, దైవం, మార్గదర్శి రూపంలో నిలిచే ప్రతి తల్లికి మదర్స్‌డే శుభాకాంక్షలు. లవ్ యూ అమ్మా” అంటూ లోకేశ్ తన సందేశాన్ని ముగించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్