బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఏపీలో కొత్త బోర్ల తవ్వకాలపై ఆంక్షలు

ఏపీలో కొత్త బోర్ల తవ్వకాలపై ఆంక్షలు

మే 11, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో భూగర్భ జలాల మట్టాలు వేగంగా పడిపోతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 7 జిల్లాల్లోని 258 గ్రామాల్లో కొత్త బోర్ల తవ్వకాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నీటి కొరత తీవ్రం కాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.శ్రీకాకుళం, ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. వ్యవసాయ, వాణిజ్య అవసరాల కోసం కొత్త బోర్లకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అయితే ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని హ్యాండ్ బోర్లకు మినహాయింపు ఇచ్చారు.భూగర్భ జలాలపై అధిక ఒత్తిడి, వర్షాభావ పరిస్థితులు, అధిక నీటి వినియోగం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఇసుక తవ్వకాల వల్ల కూడా నీటి నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలపైనా నిషేధం విధించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్