Breaking News

జీవవైవిధ్య పరిరక్షణ భవిష్యత్ తరాలకు అవసరం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా

మే 12, (నేటి తెలుగు పత్రిక): వన్యప్రాణుల సంరక్షణ భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. భవిష్యత్ తరాల భద్రత, అడవుల పరిరక్షణ కోసం జీవవైవిధ్యాన్ని కాపాడటం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో నిర్వహించిన అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్‌ వర్క్‌షాప్‌ను గవర్నర్ ప్రారంభించారు. “షేర్డ్ స్ట్రైప్స్ – షేర్డ్ ఫ్యూచర్” అనే థీమ్‌తో జరిగిన ఈ కార్యక్రమంలో పులులు, చిరుతలు, సింహాల సంరక్షణలో భారత్‌ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.నెహ్రూ జూ దేశంలో ప్రముఖ జంతు ప్రదర్శనశాలగా నిలిచిందని, వన్యప్రాణుల సంరక్షణ, అవగాహన కల్పనలో కీలక పాత్ర పోషిస్తోందని గవర్నర్ అభినందించారు. ప్రకృతి, పర్యావరణం, వన్యప్రాణుల పట్ల గౌరవం భారతీయ సంస్కృతిలో భాగమని తెలిపారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్‌ ద్వారా ప్రపంచ దేశాలు పరస్పర అనుభవాలు పంచుకునే అవకాశం కలుగుతోందన్నారు. తెలంగాణలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌, కవ్వాల్ అభయారణ్యం వంటి కేంద్రాలు రాష్ట్ర ప్రత్యేకతను చాటుతున్నాయని చెప్పారు.అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

డాక్టర్ నమ్రతకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

హ్యామ్ ప్రాజెక్ట్ పురోగతిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *