బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం వద్దు.. అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్

ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం వద్దు.. అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్

మే 12, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను హెచ్చరించారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ధాన్యం సేకరణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడారు. గన్ని బ్యాగులు, హమాలీలు, రవాణా వాహనాల కొరత లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రైతులు ధాన్యం విక్రయించేందుకు కేంద్రాలకు వచ్చినప్పుడు ఆలస్యం, అవ్యవస్థలు చోటుచేసుకోకుండా చూడాలన్నారు.ఒప్పందం ప్రకారం లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. కొనుగోలు ప్రక్రియలో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరించారు.రైతులు ఇబ్బందులు పడితే సంబంధిత అధికారులపైనే బాధ్యత ఉంటుందని సీఎం తేల్చిచెప్పినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి