బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి లొంగుబాటు

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి లొంగుబాటు

మే 12, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమానికి మరో కీలక ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ భద్రతా బలగాల ఎదుట లొంగిపోయారు. దాదాపు 28 ఏళ్ల అజ్ఞాత జీవితానికి ముగింపు పలుకుతూ ఆయన తన భార్యతో కలిసి అధికారుల సమక్షంలో సరెండర్ అయ్యారు. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన నరహరి 1996లో మావోయిస్టు పార్టీలో చేరినట్లు సమాచారం. విద్యార్థి దశలోనే ఎడమ భావజాలానికి ఆకర్షితుడైన ఆయన, తర్వాత పూర్తిస్థాయి అండర్‌గ్రౌండ్ కార్యకర్తగా మారారు. క్రమంగా పార్టీ అగ్రనాయకత్వంలో కీలక స్థానానికి ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు.భద్రతా బలగాల జాబితాలో అత్యంత కీలక మావోయిస్టు నేతల్లో నరహరి ఒకరిగా ఉన్నారు. ఆయన లొంగిపోవడం మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బగా భద్రతా సంస్థలు భావిస్తున్నాయి.ఇటీవల సరందా అడవుల్లో భద్రతా బలగాలు విస్తృత స్థాయిలో కూంబింగ్ ఆపరేషన్లు చేపడుతున్నాయి. ముఖ్యంగా మావోయిస్టు పొలిట్‌బ్యూరో సభ్యుడు మిసిరి బెస్ర కోసం కేంద్ర బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఈ ఒత్తిడి నేపథ్యంలోనే నరహరి లొంగిపోయినట్లు సమాచారం.దీర్ఘకాల అజ్ఞాత జీవితం, అడవుల్లో కఠిన పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు, భద్రతా బలగాల నిరంతర ఒత్తిడి వంటి కారణాలతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.ప్రస్తుతం నరహరిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టు కార్యకలాపాలు, కీలక నాయకుల కదలికలు, అడవి ప్రాంతాల్లో ఉన్న దళాల వివరాలపై సమాచారం సేకరిస్తున్నట్లు సమాచారం.ఇటీవలి కాలంలో ప్రభుత్వ పునరావాస విధానాలకు ఆకర్షితులై పలువురు మావోయిస్టు నేతలు, కార్యకర్తలు లొంగిపోతున్న విషయం తెలిసిందే. నరహరి సరెండర్ కూడా మావోయిస్టు ఉద్యమంలో కీలక పరిణామంగా రాజకీయ, భద్రతా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి