బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

చిన్మయ్ కృష్ణ దాస్‌కు న్యాయం చేయాలి: పవన్ కల్యాణ్ డిమాండ్

చిన్మయ్ కృష్ణ దాస్‌కు న్యాయం చేయాలి: పవన్ కల్యాణ్ డిమాండ్

మే 12, (నేటి తెలుగు పత్రిక): బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్టు వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 500 రోజులకు పైగా జైలులో ఉన్న ఆయనకు వెంటనే న్యాయం చేయాలని, తక్షణమే బెయిల్ మంజూరు చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరారు.చిన్మయ్ కృష్ణ దాస్ ఆరోగ్య పరిస్థితిపై కూడా పవన్ ఆందోళన వ్యక్తం చేస్తూ, అవసరమైన వైద్యసహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. న్యాయవాదులను కూడా బెదిరిస్తున్నారన్న వార్తలు కలవరపెడుతున్నాయని పేర్కొన్నారు.మైనారిటీ హిందువుల హక్కుల కోసం మాట్లాడటం నేరమా? అని ప్రశ్నించిన పవన్, మానవ హక్కుల పరిరక్షణలో ప్రపంచ దేశాలు స్పందించాలని కోరారు. హిందువులపై దాడులు, ఆలయాల ధ్వంసం వంటి ఘటనలపై అంతర్జాతీయ సమాజం మౌనం వీడాలని అన్నారు.ఆధ్యాత్మిక గురువును నేరస్థుడిలా చూడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. చిన్మయ్ కృష్ణ దాస్‌కు కనీస మానవ హక్కులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి