బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

ప్రభుత్వం ముందుగా ఖర్చులు తగ్గించాలి: శంకరాచార్య అవిముక్తేశ్వరానంద

ప్రభుత్వం ముందుగా ఖర్చులు తగ్గించాలి: శంకరాచార్య అవిముక్తేశ్వరానంద

మే 12, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచనలపై జ్యోతిష్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద స్పందించారు. ప్రజలకు సూచనలు చేసే ముందు పాలకులు స్వయంగా ఆచరణలో చూపించాలని ఆయన అన్నారు.ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో నిర్వహిస్తున్న ‘గోవిష్ఠ యాత్ర’ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శంకరాచార్య, కేంద్ర ప్రభుత్వ ఖర్చుల విధానంపై ప్రశ్నలు లేవనెత్తారు. భారీ వ్యయంతో కొనుగోలు చేసిన ప్రత్యేక విమానాన్ని ప్రస్తావిస్తూ, ముందుగా ప్రభుత్వం ఖర్చులను నియంత్రించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు పొదుపు అవసరాన్ని వివరించడం సరైనదేనని, అయితే ప్రభుత్వాలు కూడా విలాసవంతమైన ఖర్చులను తగ్గించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. నాయకులు ఆదర్శంగా ఉంటేనే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు.ఇటీవల అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ఇంధన ధరలు, ఆర్థిక ఒత్తిడులపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రజలకు జాగ్రత్తగా ఖర్చు చేయాలని సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శంకరాచార్య చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చకు దారితీశాయి.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ