బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

జూనియర్ డాక్టర్ హత్య కేసు.. ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను సస్పెండ్ చేసిన సీఎం సువేందు!

జూనియర్ డాక్టర్ హత్య కేసు.. ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను సస్పెండ్ చేసిన సీఎం సువేందు!

మే 16, (నేటి తెలుగు పత్రిక): కోల్‌కతాలో సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ జూనియర్ డాక్టర్ రేప్, హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు, జైళ్లలో అక్రమ కార్యకలాపాలు, ఆర్జీ కర్ ఘటన దర్యాప్తుపై నిర్వహించిన సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది.దర్యాప్తులో పరిపాలనా లోపాలు చోటుచేసుకున్నాయని, బాధితురాలి కుటుంబానికి లంచం ఇచ్చే ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో ఐపీఎస్ అధికారులు వినీత్ గోయల్, ఇందిరా ముఖర్జీ, అభిషేక్ గుప్తాలపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. “గత ప్రభుత్వ హయాంలో రక్షకులే భక్షకులుగా మారారు. నేరస్థులతో కొన్ని వర్గాలు చేతులు కలిపాయి” అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో జైళ్లలో ఖైదీలు అక్రమంగా మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నారన్న ఆరోపణలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన తనిఖీల్లో 23 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫోన్లు జైలులోకి ఎలా వచ్చాయన్న దానిపై సీఐడీ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో జైలు సూపరింటెండెంట్ ఎన్. కుజూర్, చీఫ్ కంట్రోలర్ దీప్త ఘోరాయ్‌లను కూడా సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ