బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

“రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది?” – వైఎస్ షర్మిల ప్రశ్న

“రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది?” – వైఎస్ షర్మిల ప్రశ్న

మే 16, (నేటి తెలుగు పత్రిక): దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా తప్పుబట్టారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థిక వ్యవస్థ భారత్‌దేనని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, అయితే అలాంటి పరిస్థితుల్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఎందుకు క్షీణిస్తోందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.డాలర్ విలువ తొలిసారిగా రూ.96 దాటడం దేశ ఆర్థిక పరిస్థితికి సంకేతమని షర్మిల వ్యాఖ్యానించారు. ఒకప్పుడు భారత్ మిత్రదేశాల నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేసేదని, కానీ ఇప్పుడు అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా అధిక ధరలకు చమురు దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని అన్నారు. దీంతో భారీ మొత్తంలో విదేశీ మారకద్రవ్యం దేశం నుంచి బయటకు వెళ్తోందని విమర్శించారు.“మోదీ ప్రభుత్వం బలమైన ఆర్థిక విధానాలు అమలు చేస్తోందంటే రూపాయి విలువ పాతాళానికి ఎందుకు పడిపోతోంది?” అని షర్మిల ప్రశ్నించారు. దేశ ఆర్థిక వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారం కంటే వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ఆమె ఆరోపించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్