మే 16, (నేటి తెలుగు పత్రిక): ప్రపంచ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సినీ పరిశ్రమ కూడా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నటుడు కమల్ హాసన్ సూచించారు. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం కారణంగా వాణిజ్యం, రవాణా, ఇంధన సరఫరా వ్యవస్థలపై ప్రభావం పడుతోందని అన్నారు.“ప్రతి ప్రేమకథ పారిస్‌లోనే మొదలవ్వాలా? ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ముగియాలా?” అంటూ సినీ నిర్మాణాల్లో విదేశీ చిత్రీకరణలపై ఆయన ప్రశ్నించారు. ప్రేమకథలకు విదేశీ మారకద్రవ్యం ఖర్చు చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు చిత్ర పరిశ్రమ మొత్తం కలిసి చర్చించి, ఖర్చు నియంత్రణపై దృష్టి పెట్టాలని కమల్ హాసన్ పిలుపునిచ్చారు.
సినిమాల్లోనూ పొదుపు అవసరం: కమల్ హాసన్
