బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

బండి భగీరథ్ కేసులో జడ్జిపై ట్రోలింగ్.. సోషల్ మీడియా పోస్టులపై కేసు నమోదు

బండి భగీరథ్ కేసులో జడ్జిపై ట్రోలింగ్.. సోషల్ మీడియా పోస్టులపై కేసు నమోదు

మే 17, (నేటి తెలుగు పత్రిక): పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు మహిళా జడ్జిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు వైరల్ కావడం కలకలం రేపింది. ఈ ఘటనపై హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేయడంతో చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో జస్టిస్ మాధవీ దేవిని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమెపై వ్యక్తిగత స్థాయిలో దూషణలు చేస్తూ కొన్ని పోస్టులు ప్రచారంలోకి రావడంతో హైకోర్టు తీవ్రంగా స్పందించింది.న్యాయవ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఈ పోస్టులు ఉన్నాయని, ప్రజల్లో అపనమ్మకం పెంచే ప్రమాదం ఉందని హైకోర్టు రిజిస్ట్రార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టుల వివరాలు, ఆధారాలను చార్మినార్ పోలీసులకు అందజేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టులు చేసిన వ్యక్తుల గుర్తింపుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఇక ఇదే కేసులో మరో కీలక పరిణామంగా బాధిత బాలిక, ఆమె కుటుంబ సభ్యుల ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపైనా పోలీసులు చర్యలు ప్రారంభించారు. కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు బాధితురాలి గోప్యతకు భంగం కలిగించేలా వివరాలు బయటపెట్టడంతో మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా బాలల సంక్షేమ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో పోలీసులు పలు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అకౌంట్లను గుర్తించి వాటి యూఆర్ఎల్‌లను సేకరించారు. ఖాతాలను నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. బాధితురాలి వివరాలను బహిర్గతం చేయడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి పోస్టులను షేర్ చేసినా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.పోక్సో కేసులకు సంబంధించిన బాధితుల గోప్యతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి