బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

‘డైనో డీట్స్’తో యూట్యూబ్‌లోకి నారా దేవాన్ష్

‘డైనో డీట్స్’తో యూట్యూబ్‌లోకి నారా దేవాన్ష్

మే 17, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ ‘డైనో డీట్స్’ పేరుతో కొత్త యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించారు. దీనికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేయగా సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. డైనోసార్లు, శిలాజాలు, పురాతన అవశేషాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను సరదాగా, విజ్ఞానంతో అందించేలా ఈ చానల్ రూపొందించినట్లు తెలుస్తోంది. పాడ్‌కాస్ట్‌ల రూపంలో డైనోసార్ల విశేషాలు, అరుదైన చరిత్ర అంశాలు ప్రేక్షకులకు చేరనున్నాయి. టీజర్‌లో నారా లోకేశ్ కూడా కనిపించారు. దేవాన్ష్ సృష్టించిన ప్రాచీన ప్రపంచాన్ని ఒక ప్రేక్షకుడిగా చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని లోకేశ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. నారా–నందమూరి కుటుంబ సభ్యులు దేవాన్ష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే చదరంగంలో ప్రతిభ కనబరిచిన దేవాన్ష్.. క్లిష్టమైన చెస్ పజిల్స్‌ను వేగంగా పరిష్కరించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. ఇప్పుడు యూట్యూబ్ వేదికగా విజ్ఞానాత్మక కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడం ఆసక్తికరంగా మారింది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్