బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

టీఆర్ఎస్ జెండా గద్దెలకు ఒకే నమూనా.. నెలరోజుల జెండా ఉత్సవాలకు కవిత పిలుపు

టీఆర్ఎస్ జెండా గద్దెలకు ఒకే నమూనా.. నెలరోజుల జెండా ఉత్సవాలకు కవిత పిలుపు

మే 18, (నేటి తెలుగు పత్రిక): కవిత నేతృత్వంలోని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్రవ్యాప్తంగా పార్టీ జెండా గద్దెల నిర్మాణానికి ఒకే విధమైన నమూనాను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ సమావేశంలో ప్రత్యేక మోడల్‌ను ఆవిష్కరించారు.TRS Party Officeలో జరిగిన సమావేశంలో మాట్లాడిన కవిత.. ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో ఒకే ఆకృతి, ఒకే రంగులతో జెండా గద్దెలు నిర్మించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

పార్టీ సూచించిన నమూనా ప్రకారం:

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • జెండా గద్దె మొత్తం ఎత్తు మూడు అడుగులు ఉండాలి.
  • వెడల్పు రెండు అడుగులుగా నిర్మించాలి.
  • బేస్ భాగం ఒక అడుగు ఎత్తులో గ్రీన్ రంగులో ఉండాలి.
  • పైభాగం రెండు అడుగుల ఎత్తులో ఎల్లో రంగుతో రూపొందించాలి.
  • మధ్యలో బ్లూ కలర్‌లో తెలంగాణ మ్యాప్ ఏర్పాటు చేసి, అందులో ఇంగ్లీష్‌లో “TRS” అని రాయాలని సూచించారు.
  • బేస్ భాగంలో తెలుగులో “తెలంగాణ రక్షణ సేన” అని స్పష్టంగా ఉండాలని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పార్టీ జెండాలు, గద్దెలు అన్నీ ఒకే రంగు ప్రమాణాలతో ఉండేలా కలర్ కోడ్స్‌ను ఖచ్చితంగా పాటించాలని కవిత సూచించారు. దీంతో పార్టీకి ప్రత్యేక గుర్తింపు మరింత బలపడుతుందని తెలిపారు.అలాగే ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా “జెండా పండుగ” నిర్వహించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల ద్వారా పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.