బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. సామాన్యులకు మరో షాక్

మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. సామాన్యులకు మరో షాక్

మే 19, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. వారం రోజుల వ్యవధిలో రెండోసారి చమురు సంస్థలు ధరలను పెంచడంతో వాహనదారులపై అదనపు భారం పడుతోంది. తాజాగా లీటర్‌కు సుమారు 90 పైసల చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.తాజా పెంపుతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు నగరాల్లో ఇంధన ధరలు మరింత పెరిగాయి. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.113.79కు చేరగా, డీజిల్ రూ.101.49గా నమోదైంది. విశాఖపట్నంలో పెట్రోల్ రూ.112.90, డీజిల్ రూ.100.69గా ఉంది.తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కూడా ఇంధన ధరలు పెరిగాయి. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.111.79 కాగా, డీజిల్ రూ.99.86కు చేరింది. ఇటీవలే చమురు కంపెనీలు లీటర్‌పై రూ.3 వరకు ధరలు పెంచిన నేపథ్యంలో తాజా పెంపు సామాన్యులకు మరింత భారంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పెరుగుదల, రవాణా వ్యయాల ప్రభావంతో ఇంధన ధరలు పెరుగుతున్నట్లు సమాచారం.ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశముందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి