బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

కృష్ణానదిలో బోట్ల ర్యాలీ.. నిధుల విడుదలపై మత్స్యకారుల హర్షం

కృష్ణానదిలో బోట్ల ర్యాలీ.. నిధుల విడుదలపై మత్స్యకారుల హర్షం

మే 19, (నేటి తెలుగు పత్రిక): విజయవాడలోని కృష్ణానదిలో మత్స్యకారులు భారీ బోట్ల ర్యాలీ నిర్వహించారు. ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద ప్రభుత్వం నిధులు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఈ ప్రదర్శన చేపట్టారు. తమ సంక్షేమంపై కూటమి ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని మత్స్యకారులు పేర్కొన్నారు.వేట నిషేధ కాలంలో ఇబ్బందులు పడకుండా ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్లు అందించగా, ఈ ఏడాది 1,30,796 కుటుంబాలకు రూ.262 కోట్ల సాయం అందించనున్నారు.రెండేళ్లలో ‘మత్స్యకారుల సేవలో’ పథకం ద్వారా మొత్తం రూ.505 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మత్స్యకార కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించనున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్