బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

వైసీపీ ధర్నాలను చూసి సొంత నేతలే నవ్వుకుంటున్నారు: సోమిరెడ్డి

వైసీపీ ధర్నాలను చూసి సొంత నేతలే నవ్వుకుంటున్నారు: సోమిరెడ్డి

మే 19, (నేటి తెలుగు పత్రిక): పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైసీపీ చేపట్టిన ఆందోళనలు పూర్తిగా విఫలమయ్యాయని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ధర్నాల్లో వైసీపీ కార్యకర్తలే కనిపించలేదని, ఆందోళనలను చూసి వారి పార్టీ నేతలే నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.పెట్రోల్, డీజిల్ ధరలు గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే పెరిగాయని గుర్తుచేసిన సోమిరెడ్డి.. ఇప్పుడు అదే విషయంపై వైసీపీ నిరసనలు చేపట్టడం విచిత్రంగా ఉందన్నారు. “మీ ప్రభుత్వంలో పెంచిన ధరలపై మీరే ఆందోళన చేస్తారా?” అంటూ వైసీపీ నేతలను ప్రశ్నించారు.టీడీపీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్నా.. ఈ కాలంలో పెట్రోల్, డీజిల్‌పై ఒక్క పైసా కూడా పెంచలేదని ఆయన స్పష్టం చేశారు. అసలు వాస్తవాలు తెలుసుకోకుండా వైసీపీ నేతలు రోడ్డెక్కడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.వైసీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని సోమిరెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా మద్యం ధరలు పెంచడమే కాకుండా నకిలీ మద్యం కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. ఆ ఘటనలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని పేర్కొన్నారు.రాజకీయాల్లో ప్రజా సమస్యలపై నిజాయితీగా పోరాడాల్సిన అవసరం ఉందని, కానీ వైసీపీ మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం ఆందోళనలు చేస్తోందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్