Breaking News

సముద్ర భద్రతపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. అనుమానాస్పద బోట్లపై నిఘా పెంచాలని సూచన

మే 19, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత భద్రతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. నెల్లూరు సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన జాయింట్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ పెట్రోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన సీఎం.. సముద్రంలో నిరంతర గస్తీ నిర్వహించాలని ఆదేశించారు.పలు శాఖల అధికారులు, స్థానిక మత్స్యకారులతో కలిసి ప్రత్యేక సీ పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా తమిళనాడు, పాండిచ్చేరి ప్రాంతాలకు చెందిన మరబోట్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని చెప్పారు.డ్రోన్లు, శాటిలైట్ చిత్రాలు, జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థలను వినియోగించి సముద్ర భద్రతను మరింత బలోపేతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనుమానాస్పద కదలికలను వెంటనే గుర్తించేలా సాంకేతిక వ్యవస్థలను విస్తరించాలని పేర్కొన్నారు.ఇక రాష్ట్రవ్యాప్తంగా ఫిష్ సీడ్ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కూడా సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *