బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

డ్రైవింగ్ సీట్లో సీఎం విజయ్.. మరోసారి సింప్లిసిటీతో ఆకట్టుకున్న దళపతి

డ్రైవింగ్ సీట్లో సీఎం విజయ్.. మరోసారి సింప్లిసిటీతో ఆకట్టుకున్న దళపతి

మే 20, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ మరోసారి తన ప్రత్యేక శైలితో ప్రజల దృష్టిని ఆకర్షించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మొబైల్ మెడికల్ సర్వీస్ జీప్‌ను స్వయంగా డ్రైవ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో నాయకులు కేవలం ప్రారంభోత్సవానికే పరిమితమవుతుంటారు. కానీ విజయ్ మాత్రం నేరుగా డ్రైవింగ్ సీట్లో కూర్చొని వాహనాన్ని పరీక్షించారు. అధికారులతో కలిసి జీప్‌ను పరిశీలించిన ఆయన, వైద్య సేవల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.గ్రామీణ ప్రాంతాలకు అత్యవసర వైద్య సేవలు త్వరగా చేరేలా వాహనాలు ఉండాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. బ్లాక్ సూట్‌లో కనిపించిన విజయ్ వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.“ఇదే దళపతి స్టైల్”, “సీఎం అయినా గ్రౌండ్ లెవెల్‌లో పని చూస్తున్నారు” అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రజలకు దగ్గరగా ఉండే నాయకుడిగా విజయ్ తన ప్రత్యేక ఇమేజ్‌ను మరింత బలపరుచుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ