బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్‌కు సీఎం నినాదాలు.. ‘డ్రాగన్’ గ్లింప్స్‌తో ఫ్యాన్స్ హంగామా

ఎన్టీఆర్‌కు సీఎం నినాదాలు.. ‘డ్రాగన్’ గ్లింప్స్‌తో ఫ్యాన్స్ హంగామా

మే 20, (నేటి తెలుగు పత్రిక): యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’ గ్లింప్స్ విడుదల కావడంతో అభిమానుల సందడి థియేటర్ల వద్ద తారాస్థాయికి చేరింది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, హైదరాబాద్‌లోని పలు థియేటర్ల వద్ద అభిమానులు భారీ సంబరాలు నిర్వహించారు.బాలానగర్ విమల్ థియేటర్ వద్ద అభిమానులు భారీ కటౌట్లు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేశారు. బాణసంచా కాల్పులు, డీజే సౌండ్లతో థియేటర్ పరిసరాలు సందడిగా మారాయి. గ్లింప్స్‌లో ఎన్టీఆర్ మాస్ ఎంట్రీ, ప్రశాంత్ నీల్ స్టైల్ యాక్షన్ విజువల్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా అభిమానులు “సీఎం.. సీఎం..” అంటూ నినాదాలు చేయడం చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు నినాదాలు చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.గతంలో రాజకీయ ప్రచారంలో పాల్గొన్న ఎన్టీఆర్ ప్రస్తుతం పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టినా, అభిమానుల్లో మాత్రం ఆయన రాజకీయ ఎంట్రీపై ఆసక్తి కొనసాగుతోంది. తమిళనాడులో విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యంలో, ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై కూడా సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.ఇక ‘డ్రాగన్’ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్