Breaking News

నడిరోడ్డుపై మహిళతో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో కలకలం

మే 20, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతపై మరోసారి ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. మణికొండ-నెక్నాంపూర్ ప్రాంతంలో ఓ మహిళ పట్ల యువకుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ కావడంతో విషయం బయటపడింది.నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ టౌన్‌షిప్‌లో ఈ నెల 14న మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. తన చిన్నారిని ఎత్తుకుని ఇంటికి వెళ్తున్న మహిళ వద్దకు వెనుక నుంచి వచ్చిన ఓ యువకుడు అకస్మాత్తుగా వేధింపులకు పాల్పడినట్లు వీడియోలో కనిపించింది. మహిళ ధరించిన దుస్తులను లాగుతూ అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది.మహిళ వెనక్కి తిరిగి చూసేలోపే నిందితుడు అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ పరారయ్యాడు. కొద్ది సేపు ఏమి జరిగిందో అర్థం కాక మహిళ అక్కడే నిలిచిపోయిన దృశ్యాలు కూడా సీసీటీవీలో నమోదయ్యాయి.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలు నివాస ప్రాంతంలోనే ఇలాంటి ఘటన జరగడం మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అపార్ట్‌మెంట్ కాలనీలు, పాఠశాలల పరిసరాల్లో భద్రతను మరింత పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.ఘటనపై సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

సొంత పార్టీ నేతలపై అర్వింద్ ఫైర్.. బీజేపీలో కలకలం

మైనర్ బాలికతో వివాహం.. కానిస్టేబుల్‌పై కేసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *